SL vs AFG: లంక – అఫ్గాన్ మ్యాచ్ను ఆపిన ఉడుము.. వీడియో వైరల్
SL vs AFG: ఎక్కడినుంచి వచ్చిందో ఎలా వచ్చిందో గానీ బౌండరీ లైన్ వద్ద నక్కి నక్కి పాకుతూ కనిపించడంతో అంపైర్లు ఆటను కొద్దిసేపు ఆపేశారు. లంక - అఫ్గాన్ల మధ్య రెండో రోజు ఆటలో భాగంగా..
SL vs AFG: శ్రీలంక – అఫ్గానిస్తాన్ మధ్య కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో ఉడుము వల్ల కొంతసేపు ఆట నిలిచిపోయింది. ఎక్కడినుంచి వచ్చిందో ఎలా వచ్చిందో గానీ బౌండరీ లైన్ వద్ద నక్కి నక్కి పాకుతూ కనిపించడంతో అంపైర్లు ఆటను కొద్దిసేపు ఆపేశారు. లంక – అఫ్గాన్ల మధ్య రెండో రోజు ఆటలో భాగంగా.. 48వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బౌండరీ లైన్ రోప్ వద్ద కనిపించిన ఈ ఉభయచరాన్ని అధికారులు పంపించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసే లోపే అది వాళ్లకు అంత శ్రమ కలిగించకుండానే అక్కడ్నుంచి జారుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టెస్టు మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు అఫ్గాన్ను లంక స్పిన్ ఉచ్చులో బంధించింది. తొలి ఇన్నింగ్స్లో అఫ్గాన్.. 62.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయింది. రహ్మత్ షా (91) ఒక్కడే అఫ్గాన్ బ్యాటర్లలో రాణించాడు. లంక బౌలర్లలో విశ్వ ఫెర్నాండో నాలుగు వికెట్లు తీయగా ప్రభాత్ జయసూరియ, అసిత్ ఫెర్నాండోలు తలా మూడు వికెట్లు పడగొట్టారు.
Sri Lanka vs Afghanistan Test was delayed for sometime due to “Monitor Lizard”.pic.twitter.com/rbRAVoza1p
— Johns. (@CricCrazyJohns) February 3, 2024
తొలి ఇన్నింగ్స్లో లంక.. టీ విరామ సమయానికి 69 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నె (77) రాణించాడు. ఏంజెలో మాథ్యూస్ (79 బ్యాటింగ్), దినేశ్ చండీమాల్ (68 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్కు ఈ ఇద్దరూ ఇప్పటికే అజేయంగా 139 పరుగులు జతచేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

