హైదరాబాద్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు పొడచూపాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పందించారు. వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కోటక్ కొట్టిపారేశారు. విరాట్, గంభీర్ ప్రతిరోజూ చాలాసార్లు మాట్లాడుకుంటారని తెలిపారు. గురువారం కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో వీరిద్దరూ 10 గురువారం కూడా వాళ్లిద్దరు సుమారు పది సార్లు మాట్లాడుకొని ఉంటారని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని ఆయన తెలిపారు.
తొలి వన్డేకు ముందు బర్మింగ్‌హామ్‌లో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ, గంభీర్ మాట్లాడుకోకుండా దూరంగా ఉన్న టెలివిజన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది రోజులకే కోటక్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే కోహ్లీ ఈ ఏడాది మే నెలలో కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనే తన ఆకాంక్షను మరోసారి స్పష్టం చేశారు. విరాట్‌కు నిరూపించుకోవడానికి ఇక ఏమీ మిగలలేదని పేర్కొన్నారు. జట్టుకు ఉపయోగపడినంత కాలం ఆడాలని కోరుకుంటున్నట్లు సితాంశు తెలిపారు. కాగా, ఇంగ్లండ్‌తో ఆదివారం లార్డ్స్‌లో జరిగే సిరీస్‌లో చివరి వన్డే తర్వాత, కోహ్లీకి సెప్టెంబర్‌లో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు.