గువహతి: కోల్‌కతా టెస్టులో ఓటమితో తీవ్ర విమర్శలెదుర్కుంటున్న టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మద్దతుగా నిలిచాడు. పరాభవానికి గంభీర్ ఒక్కడే బాధ్యుడు కాదన్న కొటక్.. దీని (విమర్శల) వెనుక వ్యక్తిగత ఎజెండా ఉన్నట్టు కనిపిస్తుందని అన్నాడు. కొటక్ మాట్లాడుతూ.. ‘ఓటమికి అందరూ గంభీర్‌నే బాధ్యు డిని చేస్తున్నారు.
కానీ బౌలర్లు బాగా బౌలింగ్ చేయలేదు. బ్యాటర్లు సరిగ్గా ఆడలేదు. కోచ్‌లుగా మేం సరైన మార్గనిర్దేశనం చేశామా? లేదా? అన్నదానిగురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇది సరైంది కాదు. కొందరికి వారి వ్యక్తిగత ఎజెండా ఉండొచ్చు. వారికి శుభాకాంక్షలు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. మేం గెలిచినప్పుడు ఎవ్వరూ మాకు క్రెడిట్ ఇవ్వలేదు. రెండు మ్యాచ్‌లు ఓడిపోగానే అందరూ గంభీర్‌ను వేలెత్తిచూపుతున్నారు’ అని తెలిపాడు.