Mohammad Siraj | ఓవల్ టెస్టులో చిరస్మరణీయ బౌలింగ్.. సిరాజ్‌ను వరించిన ఐసీసీ అవార్డు
Mohammad Siraj : ఇంగ్లండ్ పర్యటనలో సంచలన బౌలింగ్‌తో మ్యాచ్ విన్నర్‌గా అవతరించిన మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj ) ఐసీసీ అవార్డుకు ఎంపికయ్యాడు.
Mohammad Siraj : ఇంగ్లండ్ పర్యటనలో సంచలన బౌలింగ్‌తో మ్యాచ్ విన్నర్‌గా అవతరించిన మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj ) ఐసీసీ అవార్డుకు ఎంపికయ్యాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు(Oval Test)లో సంచలన బౌలింగ్కుగానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) అవార్డు అందుకున్నాడీ స్పీడ్‌స్టర్. ఆగస్టు నెలకుగానూ అతడికి ఈ గౌరవం లభించింది. ఈ అవార్డు కోసం మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), జైడెన్ సీల్స్ (వెస్టిండీస్) పోటీపడగా.. అత్యధిక ఓట్లతో భారత పేస్ గన్ విజేతగా నిలిచాడు.
‘నాకంటే జట్టులోని సహచరులకు, సహాయక సిబ్బందికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు చెందుతుంది. వారి నిరంతరం ప్రోత్సాహం, నాపై వాళ్లకున్న నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్‌లోని ఆటగాళ్లకు వాళ్ల సొంత గడ్డపైనే బౌలింగ్ చేయడం సవాల్‌గా తోచింది. ఒకరకంగా నాలో ఉత్తమ ప్రదర్శన వెలుగులోకి రావడానికి కారణం’ అదే అని సిరాజ్ వెల్లడించాడు.
He played a pivotal role in #TeamIndia‘s memorable performances during the tour of England recently! 👌👌
Say hello 👋 to the ICC Men’s Player of the Month for August 2025! 🔝
Congratulations, Mohammed Siraj 👏👏@mdsirajofficial pic.twitter.com/Iach0IDK3w
— BCCI (@BCCI) September 15, 2025
బుమ్రా గైర్హాజరీలో
ఇంగ్లండ్ పర్యటనలో ఐదుకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. ఏకంగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్చపరిచాడు. తన ఫిట్నెస్తో పాటు చెక్కుచెదరని ఏకాగ్రతతో అందరి ప్రశంసలు అందుకున్న మియా భాయ్.. నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో నిప్పులు చెరిగాడు. బుమ్రా గైర్హాజరీలో పేస్ దళం బాధ్యతలను భుజాన వేసుకున్న అతడు తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు.. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టాడు.

తద్వారా భారత్‌కు చిరస్మరణీయ విజయంలో కీలకపాత్ర పోషించాడీ హైదరాబాదీ పేసర్. దాంతో, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 2-2తో సిరీస్ సమం చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు తీసిన సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

