Siraj : ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుతం చేసింది. సిరీస్‌పై ఆశలు లేని స్థితి నుంచి అనూహ్యంగా మ్యాచ్ విజేతగా నిలిచింది. ఐదో రోజు ఆటలో పేసర్ మహ్మద్ సిరాజ్(Siraj) సంచలన బౌలింగ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టింది. నాలుగో రోజు డేంజరస్ హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను వదిలేసి విమర్శపాలైన సిరాజ్.. ఐదో రోజు తన పవరెంటో చూపాడు. తన వల్లే జట్టు ఓటమి అంచున నిలవడంతో.. తనే మ్యాచ్ విన్నర్ కావాలనుకున్నాడు.
అచ్చంగా తొలి సెషన్లో మియా భాయ్ అదే పని చేశాడు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న జేమీ స్మిత్(2)ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ను ఎల్బీగా ఔట్ చేసి నాలుగో వికెట్ సాధించాడు. కాసేపటికే బౌండరీలతో కంగారెత్తించిన అట్కిన్సనను సైతం బౌల్డ్ చేసి భారత్‌కు చరిత్రాత్మక విక్టరీని అందించాడు సిరాజ్. చివరి వికెట్ తీసి రొనాల్డో స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్న ఈ స్పీడ్‌స్టర్ భావోద్వేగానికి లోనయ్యాడు.
He ‘only believed in Siraj bhai’ today 😄🔥#IYKYK pic.twitter.com/DVXMkV8hmq
— ESPNcricinfo (@ESPNcricinfo) August 4, 2025
‘ఈ విజయం చాలా గొప్పగా అనిపిస్తోంది. తొలి రోజునుంచి విజయం కోసం జట్టులోని ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. అనుకున్న ఫలితం వచ్చినందకు సంతోషంగా ఉంది. సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయాలనేది మా ప్లాన్. అప్పుడు ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టవచ్చు. సరిగ్గా ప్రసిధ్ నేను అదే చేశాం. నాలుగో రోజు బ్రూక్ క్యాచ్‌ను వదిలేస్తానని, బౌండరీ లైన్ తాకుతానని అస్సలు అనుకోలేదు. నా వల్లే జట్టు ఓటమికి చేరువైంది. ఆ క్యాచ్ అందుకొని ఉంటే మ్యాచ్ ఈరోజు దాకా వచ్చేది కాదు. సో.. ఐదో రోజు ఉదయం లేవగానే నేనే గేమ్ ఛేంజర్ అవ్వాలనుకున్నా. ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి ఆతిథ్య జట్టును ఒత్తిడిలో పడేశాం. చిరస్మరణీయ విజయంతో సిరీస్ సమం చేయడం సంతృప్తిగా ఉంది’ అని సిరాజ్ వెల్లడించాడు.
A moment for the Test cricket history books ✨ pic.twitter.com/LcwTXCX2Hx
— ESPNcricinfo (@ESPNcricinfo) August 4, 2025
అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ అసలైన క్రికెట్ మాజాను అందించింది. తొలి రెండు మ్యాచుల్లో భారత్, ఇంగ్లండ్ తలా ఒకటి గెలుపొందాయి. మూడోదైన లార్డ్స్ టెస్టులో అద్భుతంగా పోరాడిన భారత జట్టు ఓటమితో సిరీస్‌లో వెనకబడింది. ఆ మ్యాచ్‌లో ఐదో రోజు జడేజాతో కలిసి టెయిలెండర్లు గొప్పగా ఆడారు. సిరాజ్ సైతం శక్తివంచన లేకుండా సహకరించాడు. అయితే.. బషీర్ బౌలింగ్‌లో బంతిని అడ్డుకున్నా.. అది వికెట్లను తాకడంతో అతడు చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక మాంచెస్టర్‌లోనూ పరాజయం తప్పదనుకున్నవేళ.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జడ్డూ, సుందర్‌లు సెంచరీలకు.. రాహుల్ ఫిఫ్టీ తోడవ్వగా డ్రా చేసుకుంది టీమిండియా.
The perfect ending. That winning wicket had to be his ⭐ pic.twitter.com/QHXmOjJxz4
— ESPNcricinfo (@ESPNcricinfo) August 4, 2025
నిర్ణయాత్మక ఓవల్‌లో యశస్వీ జైస్వాల్ (118) శతకం, ఆకాశ్ దీప్(66), వాషింగ్టన్ సుందర్(53)ల అర్ధ శతకంతో పటిష్ట స్థితిలోనే నిలిచినా.. టెయిలెండర్ల వైఫల్యంతో ఇంగ్లండ్ పోటీలోకి వచ్చింది. 374 పరుగుల రికార్డు ఛేదనలో ఆతిథ్య జట్టు హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలతో విజయం వాకిట నిలిచింది. అయితే.. నాలుగో రోజు వర్షం, వెలుతురు లేమి కారణంగా ఆటను త్వరగా నిలిపివేశారు. ఐదోరోజున సిరీస్‌ను పట్టేసేందుకు ఇంగ్లండ్‌కు 35 రన్స్.. సమం చేసేందుకు భారత్‌కు 4 వికెట్లు కావాలి. ఈ పరిస్థితుల్లో సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో మూడు వికెట్లు తీయగా.. భారత జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.