Ranji Trophy : టీమిండియా పేసర్ సిరాజ్ (Mohammad Siraj) దేశవాళీ క్రికెట్లో చెలరేగిపోయాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ డీ (Elite D) మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ బ్యాటర్లకు వణికిస్తూ వికెట్ల వేటతో హైదరాబాద్‌కు బ్రేకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు(4-56) తీసి ప్రత్యర్ధిని ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు మియా భాయ్. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ వికెట్ పడకుండా 56 పరుగులు చేసింది.
రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ డీలోని ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ రెచ్చిపోయాడు. జింఖాన మైదానంలో తన తడాఖా చూపిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడీ స్పీడ్‌స్టర్. ఓపెనర్ అనుజ్ తివారీ(4)ను ఔట్ చేసి తొలి బ్రేకిచ్చిన సిరాజ్. ఆ తర్వాత సంజీత్ దేశాయ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రతీక్ యాదవ్(106)తో కలిసి జట్టును ఆదుకున్న వికల్ప్ తివారీ(94)ని సైతం వెనక్కి పంపిన అతడు.. టెయిలెండర్ ఆదిత్య సర్వాతే(4)ను ఔట్ చేసి నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. సీటీఎల్ రక్షణ్(2-28) రెండు వికెట్లతో రాణించగా ఛత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 283 కే ఆలౌటయ్యింది.
Captain Mohammed Siraj delivered a brilliant spell for Hyderabad in the first innings against Chhattisgarh in the Ranji Trophy 2025-26 👏#MohammedSiraj #Hyderabad #RanjiTrophy #CricketTwitter pic.twitter.com/T8hj3wpbRd
— InsideSport (@InsideSportIND) January 29, 2026
ప్రతీక్ సెంచరీ, వికల్ప్ అర్ధ శతకంతో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లిన ఛత్తీస్‌గఢ్‌ను మూడొందలలోపే కట్టడి చేసిన బౌలర్ల కృషిని బ్యాటర్లు వృథా కానివ్వలేదు. ఓపెనర్లు అమన్ రావు పెరాల(32 నాటౌట్), అభిరత్ రెడ్డి(23 నాటౌట్)లు అదిరే ఆరంభమిచ్చారు. దాంతో, తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 56 రన్స్ చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 227 పరుగులు వెనకబడి ఉంది.