దుబాయ్ : హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. ఆగస్టు నెలకు గాను అతడు ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు.
గత నెలలో ముగిసిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమ్ఇండియా ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2తో డ్రా చేయడంలో సిరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఆఖరి టెస్టు తీవ్ర ఒత్తిడిలోనూ అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు.