AFC Asia Cup Qualifiers : రెండేళ్ల తర్వాత జరుగబోయే ఏఎఫ్సీ ఆసియా కప్‌లో ఆడాలనుకున్న భారత ఫుట్‌బాల్ జట్టు కల చెదిరింది. మంగళవారం జరిగిన మూడో రౌండ్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌లో సింగపూర్ జట్టు బ్లూ టైగర్స్‌కు షాకిచ్చింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో ఫార్వర్డ్స్ రాణించినా.. డిఫెన్స్ బలంగా లేకపోవడంతో 1-2తో ఓటమి ఎదురైంది. దాంతో.. కొత్త కోచ్ ఖలీద్ జమిల్ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాలనుకున్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి.
ఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో రెండే పాయింట్లతో ఉన్న భారత్ చావోరేవో మ్యాచ్‌లో సింగపూర్‌తో తలపడింది. సొంత ప్రేక్షకుల సమక్షంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగింది గేమ్. ఆట ఆరంభంలోనే లల్లియంజులా ఛాంగ్టే (Lallianzuala Chhangte) బ్లూ టైగర్స్‌కు మొదటి గోల్ అందించాడు.
✨AFC ASIAN CUP 2027 QUALIFIERS | Group C
FT: India 🇮🇳 1️⃣ – 2️⃣ 🇸🇬 Singapore#AFC #AsianQualifers #ASEANFootball pic.twitter.com/R0LzeFLAh7
— ASEAN FOOTBALL (@theaseanball) October 14, 2025
అయితే.. ప్రత్యర్థి మిడ్‌ఫీల్డర్ సాంగ్ యూ – యంగ్ 44వ నిమిషంలోనే గోల్ కొట్టగా స్కో్ర్ సమం అయింది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు గోల్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. కానీ, 58వ నిమిషంలో సాంగ్ మరో గోల్‌తో సింగపూర్ ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. అయితే.. గెలిచితీరాల్సిన మ్యాచ్ కావడంతో కోచ్ జమిల్ ఆటగాళ్లను మారుస్తూ ఆటాకింగ్ చేయించాలని చూసినా ఫలితం లేకపోయింది. మరోక గ్రూప్ మ్యాచ్‌లో హాంకాంగ్, బంగ్లాదేశ్ 1-1తో డ్రా ముగించాయి.