PV Sindhu : పారిస్ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) అదరగొడుతోంది. తొలి రెండు రౌండ్లలో పోరాడి గెలుపొందిన తెలుగు తేజం ఈసారి రెండోసీడ్ను అలవోకగా చిత్తు చేసింది. గురువారం జరిగిన 16వ రౌండ్లో చైనాకు చెందిన వాంగ్ జీ యూ (Wang Zhi Yi)ని మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిందీ ఒలింపిక్ విజేత.
మాజీ ఛాంపియన్ అయిన సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో జోరు చూపిస్తోంది. తొలి రౌండ్లో బల్గేరియాకు చెందిన కలోయనా నల్బంతోవాను ఓడించిన సింధు పదహారో రౌండ్లో మలేషియా షట్లర్ కరుపథెవన్ను ఇంటికి పంపింది. కీలకమైన ప్రీ క్వార్టర్స్‌లోనూ చెలరేగిన భారత స్టార్ రెండో సీడ్ వాంగ్ జీకి షాకిచ్చింది.
PV Sindhu (WR: 15) wins against Wang Zhi Yi (WR: 2) in STRAIGHT GAMES! 😱
She will face Indonesia’s Putri Kusuma Wardani in the quarter-finals 💪
➡️ Read more: https://t.co/qaC42cLT79 pic.twitter.com/fUHmek1DlX
— ESPN India (@ESPNIndia) August 28, 2025
హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను 21-19తో కైవసం చేసుకున్న సింధు.. రెండో సెట్లోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. వాంగ్ పుంజుకుని స్కోర్లు సమం చేసినా తనదైన పవర్ గేమ్‌తో సింధు 21-15తో సెట్ గెలుచుకుంది. ఈ విజయంతో టైటిల్ వేటకు రెండడుగుల దూరంలో నిలిచిందీ బ్యాడ్మింటన్ స్టార్.