Thailand Open : థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (PV Sindhu), పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) – చిరాగ్ శెట్టి(Chirag Shetty) అద్భుత విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో అమలీ స్కుల్జ్(డెన్మార్క్) 28 నిమిషాల్లోనే తెలుగుతేజం చేతిలో కంగుతినగా.. మలేషియా జంటను సాత్విక్ – చిరాగ్ జోడీ చిత్తు చేసి పతకంపై ఆశలు రేపింది.
బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నమెంట్లో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఒక్క టైటిల్ కూడా నెగ్గని భారత స్టార్ గురువారం ప్రీ క్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన అమలీ స్కుల్జ్ను చిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సింధు కేవలం 28 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
తొలి సెట్‌ను 21-13తో గెలుపొందిన ఒలింపిక్ విజేత.. అదే ఊపులో రెండో సెట్లోనూ ప్రత్యర్ధికి అవకాశమివ్వలేదు. అటాకింగ్ గేమ్ ఆడి 21-15తో పైచేయి సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. సెమీస్ బెర్తు కోసం అకనే యమగుచి(జపాన్)తో సింధు తలపడనుంది.
Winning starts for Satwik-Chirag, PV Sindhu, and Kidambi Srikanth at the Thailand Open 2026! ✅
You can catch all the action LIVE on the BWF YouTube channel! 📺
[📸 @badmintonphoto ] pic.twitter.com/FTGHYH7eSX
— BAI Media (@BAI_Media) May 13, 2026
పురుషుల డబుల్స్‌లో టాప్ గేర్‌లో ఆడుతున్న సాత్విక్ సాయిరిజ్ – చిరాగ్ జంట మలేషియా షట్లర్లను ఇంటికి పంపింది. ప్రీక్వార్టర్స్‌లో బ్రియాన్ జెరెమి గూంటింగ్ – ముహమ్మద్ హైకాల్ను వణికించిన భారత ద్వయం తొలిసెట్‌ను 21-12తో అలవోకగా గెలుచుకుంది. కానీ, రెండో సెట్లో పుంజుకున్న ప్రత్యర్ధి జంట గట్టిపోటీనిచ్చింది. అయినా సరే 21-19తో గెలుపొందిన సాత్విక్ – చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. తర్వాతి రౌండ్లో జపాన్‌కు చెందిన ఆరో సీడ్ తకుమి నొమురా – యుచీ శిమొగామిని ఢీకొట్టనుంది.