‘అనగనగా’ విజయం తర్వాత ఈటీవీ విన్ సంస్థలో సుమంత్ చేసిన సినిమా ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకుడు. కె.హరీశ్ నిర్మాత. ఈ నెల 31న సినిమా థియేటర్ల విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో అడివి శేష్ ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. సుమంత్ మాట్లాడుతూ “మళ్లీ రావా’ తర్వాత సింగిల్ సిట్టింగ్‌తో ఓకే చేసిన కథ ‘న్యూటన్స్ థర్డ్ లా’. ఇందులో ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది.
ఇది థ్రిల్లరే అయినా.. సెంట్రల్ డ్రామా ఫ్యామిలీ చుట్టూనే ఉంటుంది. థియేటర్లలో ఆడియన్స్‌కి పెద్ద సర్ప్రైజ్ ఈ సినిమా’ అని నమ్మకంగా చెప్పారు. ఆడియన్స్‌కి హయ్యస్ట్ కిక్‌ని ఇచ్చే సినిమా ఇదని, ఇంటర్వెల్‌కే ఆడియన్‌కి పైసా వసూల్ ఫీల్ వస్తుందని, ైక్లెమాక్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని దర్శకుడు రాజేశ్ కర్ణ చెప్పారు. ఇంకా ఈటీవీ విన్ ప్రతినిథులు సాయికృష్ణ, భరణ్, నటి నేహ, నిర్మాత హరీశ్, సంగీత దర్శకుడు సింజిత్, నటులు త్రినాథ్, రవివర్మ కూడా మాట్లాడారు.