ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ 5 హీరోయిన్లలో సాయిపల్లవి కచ్చితంగా ఉంటారు. ఇప్పటివరకూ సాయిపల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి గానీ, సాయిపల్లవిని రిజక్ట్ చేసిన సినిమాలు లేవు. దటీజ్ సాయిపల్లవి. ఆమెను మెప్పించాలంటే ముందు మంచి కథతో వెళ్లాలనేది దేశవ్యాప్తంగా ఉన్న దర్శకనిర్మాతల మాట.
కథకు, పాత్రకూ తొలిప్రాధాన్యతనిచ్చే సాయిపల్లవి.. అసలు పారితోషికం ఎంత తీసుకుంటుంది? అనేది మాత్రం చాలామందికి తెలీదు. కానీ ప్రస్తుతం బీటౌన్ సమాచారం ప్రకారం నితేష్ తివారీ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న ‘రామాయణ’ చిత్రానికి రెండు భాగాలకు గాను రూ.20 కోట్లను ఆమె రెమ్యునరేషన్‌గా అందుకుంటున్నదని తెలిసింది. అంటే సినిమా పదికోట్లన్నమాట. ఈ స్థాయి పారితోషికం అందుకునే తారలు ఇండియాలో అరుదు.