1975లో వచ్చిన ‘నిశాంత్’ సినిమా ద్వారా సినీరంగంలోకి ప్రవేశించారు ప్రఖ్యాత నటుడు నసీరుద్దీన్ షా. గత ఏడాది సెప్టెంబర్‌కి సినీనటుడిగా 50ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారాయన. ఈ యాభై ఏండ్లలో హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, జపనీస్తో పాటు పలు విదేశీ భాషల్లోనూ నటించారు నసీరుద్దీన్ షా. కానీ తెలుగులో మాత్రం ఇప్పటివరకూ సినిమా చేయలేదు.
అయితే.. ఆయన ఇతర భాషల్లో చేసిన సినిమాల వల్ల తెలుగు జనాలకు కూడా నసీరుద్దీన్ అభిమాన నటుడయ్యారు. అయితే.. ఇన్నాళ్లకు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నారు. ‘కల్కి 2’లో ఆయన కీలక పాత్ర పోషించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 50ఏండ్ల కెరీర్లో తొలిసారి ఆయన తెలుగుతెరపై కనిపించనున్నారు.
ఇప్పటికే అమితాబ్, ప్రభాస్ లాంటి ఉద్దండులు నటిస్తున్న ఈ సినిమాలో నసీరుద్దీన్ షా కూడా చేరడం ఉత్తరాది మార్కెట్‌పై బలమైన ప్రభావమే చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు నాగ్అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.