హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ ద్వారా సంపాదించిన అక్రమ ఆస్తులను జప్తు చేయడంపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ దృష్టి సారించింది. డ్రగ్స్ పట్టుకోవడం, నిందితులను అరెస్టు చేయడం వరకే దర్యాప్తును పరిమితం చేయకుండా.. అక్రమంగా వచ్చిన డబ్బు ఎకడికి చేరింది? ఆ డబ్బుతో ఏయే ఆస్తులు సమకూరాయి? అనే కోణంలో ఆర్థిక దర్యాప్తును విస్తరించింది.
ఇందులో భాగంగా 2025లో నమోదైన అల్ప్రాజోలం కేసులో జహీరాబాద్ టౌన్ పోలీసులు, తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమన్వయంతో చేపట్టిన దర్యాప్తులో నిందితుడు విష్ణునాథ్ కర్బారి షిపాంకర్తోపాటు అతని బంధువులకు సంబంధించిన ఆస్తులను గుర్తించారు. వీటి ప్రభుత్వ అంచనా విలువ సుమారు రూ.1.40 కోట్లు కాగా.. ప్రస్తుత మారెట్ విలువ సుమారు రూ.4 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఆ స్థిరాస్తులను డ్రగ్స్ విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ ఆస్తులను జప్తు చేశారు.