BWF World Championships : గత ఏడాది నుంచి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న పీవీ సింధు (PV Sindhu) బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ముందంజ వేసింది. తొలి రౌండ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన తెలుగు తేజం బల్గేరియాకు చెందిన కలోయనా నల్బంతోవాను చిత్తు చేసింది. తొలి సెట్ నుంచి దూకుడుగా ఆడిన సింధు రెండో సెట్లో మరింత రెచ్చిపోయింది. 23-21, 21-6తో అలవోకగా గెలుపొంది రెండో రౌండ్‌కు దూసుకెళ్లిందీ ఒలింపిక్ విజేత.
ఇటీవల పలు టోర్నీ్ల్లో మొదటి రౌండ్లోనే ఇంటిదారి పడుతున్న సింధు ఈసారి సత్తా చాటింది. పారిస్ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కలోయనా నల్బంతోవాను మట్టికరిపించింది. తొలి సెట్లో 69వ ర్యాంకర్ అద్భుతంగా ఆడడంతో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. దాంతో, అతికష్టమ్మీద సింధు 23-21తో సెట్ గెలుచుకుంది.
PV SINDHU MOVES INTO ROUND OF 32 💥
She defeated Kaloyana Nalbantova 🇧🇬 23-21, 21-6 at BWF World Championships 2025 🏸
Dominance by Sindhu in 2nd Game! 🔥 pic.twitter.com/rSz2YNUaM9
— The Khel India (@TheKhelIndia) August 26, 2025
రెండో సెట్లో మాత్రం భారత షట్లర్ ధాటికి ప్రత్యర్థి నిలువలేకపోయింది. చెక్కుచెదరని డిఫెన్స్‌తో పాటు బలమైన షాట్లతో విరుచుకుపడిన సింధు 21-6తో సెట్ కైవసం చేసుకుంది. రెండో రౌండ్లో ఆమె సలోని సమిర్భాయ్ మెహతా(హాంకాంగ్), కరుపతెవన్ లెట్షానా(మలేషియా) మ్యాచ్ విజేతతో తలపడనుంది.