PV Sindhu : భారత బ్యాడ్మింటన్‌పై చెరగని ముద్ర వేసిన సైనా నెహ్వాల్ (Saine Nehwal)తన సుదీర్ఘ కెరీర్‌ను ముగించింది. ఒలింపిక్ పతకంతో పాటు పలు టోర్నీల్లో విజేతగా నిలిచిన సైనా ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. వారిలో ఒకరైన పీవీ సింధు (PV Sindhu) సంచలన ఆటతో దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఎదిగింది. ఈమధ్యే సింగిల్స్‌లో 500 విజయంతో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. ఒకప్పటి తన ప్రత్యర్థి సైనా వీడ్కోలుపై స్పందించింది.
ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపిచంద్‌లు పురుషుల బ్యాడ్మింటన్‌లో దిగ్గజాలు. మరి, మహిళల విభాగంలో వీరి మాదిరిగా ఉన్నత శిఖరాలకు చేరిన తొలి షట్లర్ సైనా నెహ్వాలే. చైనా కోటను బద్దలు కొడుతూ విజేతగా నిలిచిన తను.. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుపొందింది. 2019లో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సింధును ఓడించి టైటిల్ సాధించింది సైనా. రాకెట్ పట్టి గొప్ప విజయాలు సాధించేందుకు ప్రేరణగా నిలిచిన ఈ సీనియర్‌కు సింధు అభినందనలు తెలిపింది.
Wishing you a happy retirement, @NSaina. Thank you for everything you’ve contributed to Indian badminton. Wishing you peace, happiness, and the very best in this next phase of life ❤️🤗
— Pvsindhu (@Pvsindhu1) January 23, 2026
‘బ్యాడ్మింటన్‌లో వీడ్కోలు పలికినందుకు అభినందనలు సైనా. భారత బ్యాడ్మింటన్‌కు విశేష సేవలందించినందుకు నీకు ధన్యవాదాలు. నీ జీవితంలో తదుపరి దశ ప్రశాంతత, సంతోషంతో సాగిపోవాలని కోరుకుంటున్నా’ అని ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించింది సింధు.
‘గత రెండేళ్లుగా నేను బ్యాడ్మింటన్ ఆడడం లేదు. నాకు నేనుగా ఈ ఆటలోకి వచ్చాను. అలానే నాకు నేనుగా వైదొలిగాను. కాబట్టి.. వీడ్కోలు ప్రకటించాల్సిన అవసరం లేదు’ అని ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పింది సైనా. గణాంకాలు గమనిస్తే.. సింధుపై సైనాదే పైచేయి. వీరిద్దరూ నాలుగుసార్లు తలపడగా.. మూడు దఫాలు సైనా గెలుపొందింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో చరిత్ర సృష్టించింది సైనా.
How Did Saina Nehwal Redefine Indian Badminton? New Delhi, Jan 23 (NationPress) Two-time Olympic medallist PV Sindhu and Indian
cricket legend Virat Kohli celebrated the iconic career of Saina Nehwal, whose
remarkable contributions have brought… https://t.co/hRrB9iA5Xi pic.twitter.com/uPVVtPGZ7y— NationPress (@np_nationpress) January 23, 2026
భారత్‌లో మహిళల బ్యాడ్మి్ంటన్ అభివృద్ధికి ఆమె విజయం టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అబ్బురపరిచే విజయాలతో భావి తారగా ఎదిగిన సింధు.. 2016 రియో ఒలింపిక్స్‌లో రతజం, ఆపై 2020 టోక్యోలో కాంస్యంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. వరుసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలతో ఎవరికీ సాధ్యమవ్వని రికార్డు నెలకొల్పింది సింధు.