చెంగ్డు: చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత యువ షూటర్ సిఫ్ట్‌కౌర్ సమ్రా పతక జోరు కనబరిచింది. రెండు స్వర్ణాలు సహా రజతం, కాంస్య పతకంతో సత్తాచాటింది. మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్లో సిఫ్ట్‌కౌర్ 462.9 స్కోరుతో పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో సిఫ్ట్‌కౌర్, అశి చౌక్సి, మానిని కౌశిక్ త్రయం
స్వర్ణం ఖాతాలో వేసుకుంది.