దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను.. లాంగ్ ఆఫ్‌లో శుభమన్ గిల్(Shubman Gill) అందుకున్నాడు. అయితే ఆ క్యాచ్ పట్టిన తీరుపై ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గిల్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు. పరుగెత్తుతూ క్యాచ్‌ను అందుకున్న గిల్..ఆ రన్‌లోనే బంతిని పట్టిన ఆనందంలో విసిరేశాడు. వాస్తవానికి గిల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కానీ కొత్త రూల్స్ ప్రకారం అలా .. బంతిని విసిరేయడం సరైంది కాదు.
ఎంసీసీ రూల్స్ ప్రకారం.. బంతిని అందుకున్న ఫీల్డర్.. పూర్తిగా కంట్రోల్లో ఉండే వరకు ఆ బంతిని చేతిలోనే పట్టుకోవాలి. ఇక్కడ ఫీల్డర్ గిల్.. రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. కానీ ఇంకా అతను బాడీని కంట్రోల్లోకి తీసుకురాలేదు. అంతకన్నా ముందే అతను తన చేతుల్లో ఉన్న బంతిని విసిరేశాడు. కొత్త రూల్ ప్రకారం.. ఇది క్యాచ్ కాదు. కానీ గిల్‌కు వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించాడు.
#BREAKING : Shubman Gill Warned By Umpire Over Travis Head Dismissal.
Shubman Gill took a running catch to dismiss Travis Head at long-on but he released the ball from his hands while still running.#TravisHead #varunchakravarthy #VarunChakaravarthy #shubhmangill #INDvsAUS… pic.twitter.com/khM7LHEkgP— upuknews (@upuknews1) March 4, 2025
స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై కీలకమైన ట్రావిస్ హెడ్ వికెట్‌ను వరుణ్ తీసుకున్నాడు. మరో వైపు ఆస్ట్రేలియా వంద స్కోరు దాటింది. స్మిత్, లబుషేన్ క్రీజ్‌లో ఉన్నారు.