Shubman Gill : టెస్టు కెప్టెన్‌గా స్వదేశంలో మొదటి సిరీస్ గెలుపొందిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) వన్డే సారథిగా తొలి సిరీస్ ఆడబోతున్నాడు. వరల్డ్ కప్ సన్నద్ధతలో ఒకటైన ఆస్ట్రేలియా పర్యటననూ విజయంతో ముగించాలని భావిస్తున్నాడీ యంగ్‌స్టర్. పెర్త్ స్టేడియంలో ఆదివారం తొలి మ్యాచ్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడుతూ సీనియర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)తో అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ వచ్చినంత మాత్రాన తానేమీ మారలేదని, తమ మధ్య మునపటి సాన్నిహిత్యమే కొనసాగుతోందని గిల్ వెల్లడించాడు.
అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియా పర్యటనతో కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఫామ్ చాటుకొని వన్డే వరల్డ్ కప్‌లో చోటే లక్ష్యంగా పెట్టుకున్నారిద్దరూ. మరోవైపు గిల్ పరిస్థితి వేరు. నాయకుడిగా తొలి వన్డే సిరీస్ అది కూడా తాను ఎంతగానో ఆరాధించిన ఆటగాళ్లను నడిపించనున్నాడు అతడు. ఈ నేపథ్యంలో.. కెప్టెన్సీ మార్పుతో కోహ్లీ, రోహిత్‌తో గిల్ మధ్య అనుబంధం చెడిందనే వార్తలు వస్తున్నాయి. అయితే.. అవన్నీ కట్టుకథలని అంటున్నాడు గిల్.
𝙍𝙚𝙖𝙙𝙮. 𝙎𝙚𝙩. 𝙍𝙚𝙡𝙤𝙖𝙙𝙚𝙙 🔃#TeamIndia Captain Shubman Gill and Australian skipper Mitchell Marsh meet ahead of the 1️⃣st ODI 🏆#AUSvIND | @ShubmanGill pic.twitter.com/MBPaB2iL0R
— BCCI (@BCCI) October 18, 2025
‘బయట ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇంతకుముందు మేము ఎలా ఉన్నామో ఇప్పుడూ అలానే ఉన్నాం. రోహిత్, విరాట్‌కు చాలా అనుభవవం ఉంది. వైట్ బాల్ క్రికెట్లో ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు. వీళ్లకు ఆస్ట్రేలియాలోనిపిచ్ గురించి.. పరిస్థితుల గురించి వాళ్లకు బాగా తెలుసు. అందుకే నాకు ఏ సందేహం వచ్చినా వాళ్లను సంప్రదిస్తా. ఏ మొహమాటం లేకుండా ఇద్దరూ నాకు అన్ని విషయాలు చెబుతారు. మనుషుల ఆలోచనలు తెలుసుకొని.. ఆటపై నా సొంత అవగాహన పెంచుకోవాలనుకుంటా. మ్యాచ్ సమయంలో పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటా’ అని గిల్ వెల్లడించాడు.
“They are the best white-ball players, won’t be shy in taking suggestions for them”: Shubman Gill on Ro-Ko ahead of 1st ODI against Australia
Read @ANI Story | https://t.co/Ao1G31epXH#ShubmanGill #RohitSharma #ViratKohli #ODI #Australia pic.twitter.com/7Ut76znbnh
— ANI Digital (@ani_digital) October 18, 2025
యాభై ఓవర్ల ఫార్మాట్లో వెటరన్స్ ధోనీ, కోహ్లీ, రోహిత్ వారసత్వాన్ని కొనసాగించడంపై కూడా గిల్ స్పందించాడు. వన్డే కెప్టెన్ అయ్యాక కోహ్లీ, రోహిత్‌తో మాట్లాడాను. జట్టును ఎలా నడిపించాలి? డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి కల్చర్ ఉండాలి? వంటి విషయాలను వాళ్లతో ప్రస్తావించాను. ఈ దిగ్గజ ఆటగాళ్లు నాతో చెప్పిన అంశాలు, సూచనలు అన్నీ నాకెంతగానో ఉపయోగపడనున్నాయి. వన్డేల్లో ధోనీ, కోహ్లీ, రోహిత్ వారసడిగా ఎంపికవ్వడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ఈ ముగ్గురి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఇదివరకూ చెప్పినట్టే ధోనీ, రోహిత్‌లా ప్రశాంతంగా కనిపిస్తూనే.. విరాట్‌లా దూకుడు కనబరుస్తా అని గిల్ పేర్కొన్నాడు.
Brace yourselves…they’re 𝘽𝙖𝙘𝙠 𝙄𝙣 𝘽𝙡𝙪𝙚𝙨 🔥
Rohit Sharma 🤝 Virat Kohli
🎥 Watch on loop as the duo gears up for #AUSvIND 💪 #TeamIndia | @ImRo45 | @imVkohli pic.twitter.com/u99yHyFfwJ
— BCCI (@BCCI) October 17, 2025
సుదీర్ఘ కాలం భారత జట్టుకు ఆటగాడిగా, నాయకుడిగా రోహిత్, విరాట్ విశేష సేవలందించారు. అయితే.. ఒకరితర్వాత ఒకరు టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వీరు కొనసాగుతున్న ఫార్మాట్ వన్డే మాత్రమే. వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో
ఆడాలనుకుంటున్న ఈ వెటరన్ బ్యాటర్లకు.. ఆస్ట్రేలియా సిరీస్ ఎంతో కీలకం కానుంది. మూడు వన్డేల్లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడింతే.. మరో సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. దాంతో, అనుభవజ్ఞులైన ఈ ఇద్దరూ తమ సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు. ఆస్ట్రేలియాపై రోహిత్, కోహ్లీకు మెరుగైన రికార్డుంది. రోహిత్ 19 మ్యాచుల్లో.. 990 రన్స్ సాధించగా.. రన్ మెషీన్ విరాట్ 18 మ్యాచుల్లో 802 పరుగులు బాదాడు.