లండన్ : ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న యువ భారత జట్టు స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. ఓవల్ టెస్టు ముగిసిన తర్వాత మంగళవారం ఉదయమే భారత జట్టులోని పలువురు సభ్యులు లండన్‌ను వీడారు.
లండన్ నుంచి దుబాయ్‌కు చేరుకునే ఆటగాళ్లు.. అక్కడ్నుంచి నేరుగా ఎవరి స్వస్థలానికి వారు వెళ్లనున్నారు. సిరాజ్, అర్ష్‌దీప్, శార్దూల్ ఇప్పటికే లండన్‌ను వీడగా పలవురు క్రికెటర్లు ఇంకా అక్కడే ఉన్నారు. సిరాజ్ దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు రానున్నాడు.