అహ్మాదాబాద్: శుభమన్ గిల్(shubman gill) ఔటయ్యాడు. 128 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. లియాన్(Lyon) బౌలింగ్‌లో అతను వికెట్ల ముందు చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్టు మూడో రోజు ఇండియా 79 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 245 రన్స్ చేసింది. గిల్, కోహ్లీ మధ్య మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. కోహ్లీ 33 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. గిల్ 235 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
Shubman Gill departs after a fine knock of 128.
India 245/3 https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/cR3W20AKSf
— BCCI (@BCCI) March 11, 2023