IND vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్(56 : 39 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. తనదైన స్టయిల్లో సిక్సర్‌తో ఫిఫ్టీ సాధించాడు. ఈ ఫార్మాట్లో గిల్‌కు ఇది 9వ అర్ధ శతకం. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(41 నాటౌట్)తో కలిసి స్కోర్ బోర్డును పరుగలు పెట్టించాడు దాంతో, 15 ఓవర్లకు భారత జట్టు వికెట్ కోల్పోకుండా 99 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి ఇంకా 175 పరుగులు కావాలి. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 277 పరుగుల చేధనలో గిల్, రుతురాజ్ మొదటి నుంచి ధాటిగా ఆడుతున్నారు. దాంతో, 8.4 ఓవర్లకే ఇండియా స్కోర్ 50 దాటింది.
Shubman Gill brings up his FIFTY in style 🔥🔥
His 9th half-century in ODIs.
Live – https://t.co/F3rj8GI20u… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/BHqYzbt6Rf
— BCCI (@BCCI) September 22, 2023
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52), జోష్ ఇంగ్లిస్(45), స్టీవ్ స్మిత్(41) మాత్రమే రాణించారు. పేసర్ షమీ దెబ్బకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. తొలి స్పెల్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్(4), స్టీవ్ స్మిత్(41)లను ఔట్ చేసిన షమీ ఆసీస్ టాపార్డర్‌ను కూల్చాడు. ఆ తర్వాత రెండో స్పెల్‌లో మిడిల్ ఆర్డర్ పని పట్టాడు. డేంజరస్ ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్(29), మాథ్యూ షార్ట్(2)తో పాటు బౌలర్ సియాన్ అబాట్(2)లను పెవిలియన్ పంపి షమీ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతడు ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి.