IND vs NZ : భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకటి వెంట ఒకటి వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్, రోహిత్ శర్మ.. వన్ డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాటపట్టారు. జట్టు స్కోర్ 15 పరుగుల వద్ద శుభ్‌మాన్ గిల్ (2) ఔటయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. గిల్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 15 పరుగులు.
ఆ తర్వాత ఆరో ఓవర్ తొలి బంతికి నిలదొక్కుకున్నాడనుకున్న రోహిత్ శర్మ (15) ఔటయ్యాడు. జామిసన్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 5.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు. ఆ తర్వాత ఓవర్లోనే విరాట్ కోహ్లీ (11) కూడా పెవిలియన్ చేరాడు. మ్యాచ్ హెన్రీ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. జట్టు స్కోర్ 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 35 పరుగులు.