Ranji Trophy 2024-25 : ప్రతి రంజీ ట్రోఫీలో కొత్త స్టార్లు పుట్టుకొస్తుంటారు. తమ సంచలన ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటుకు పోటీ పడుతుంటారు. మూడు రోజల క్రితం మొదలైన రంజీ సీజన్లో తొలి డబుల్ సెంచరీ నమోదైంది. జమ్ముకశ్మీర్ ఆటగాడు శుభం ఖాజురియా (Shubham Khajuria) ద్విశతకంతో చరిత్ర సృష్టించాడు.
శ్రీనగర్ వేదికగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన ఖాజురియా రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 22 ఏండ్ల తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా ఖాజురియా రికార్డు నెలకొల్పాడు. జమ్ము కశ్మీర్ రాష్ట్రం నుంచి రంజీల్లో దిశ్వతకం బాదిన మూడో ప్లేయర్‌గా ఖాజురియా చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు అశ్వనీ గుప్తా, కవల్జిత్ సింగ్‌లు 200 కొట్టేశారు. గుప్తా 1995లో ఈ ఘనత సాధించగా.. కవల్జిత్ 2002లో ద్విశతకంతో మెరిశాడు.
The record holder former captains of #JammuAndKashmir Ranji Trophy team have showered praises for JK Cricket Association (JKCA) batsman Shubham Khajuria, who became the first cricketer in more than two decades to score a double century in ongoing #RanjiTrophy match in #Srinagar. pic.twitter.com/8ckYEEmdvy
— Seher Mirza (@SeherMirzaK) October 14, 2024
సొంతగడ్డపై ఖాజురియా విధ్వంసక డబుల్‌కు తోడు.. పుందిర్(37), పరాస్ డోగ్రా(30)లు రాణించారు. చివర్లో అబ్దుల్ సమద్(23), సహిల్ లొత్రా(18)లు ధనాదన్ ఆడడంతో తో పటిష్ట స్థితిలో నిలిచిన జమ్ము కశ్మీర్ జట్టు 519/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.