ముంబై : టీమ్ఇండియా టీ20 జట్టుకు కొత్త సారథి రాబోతున్నాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను తప్పిస్తూ అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జట్టులో మార్పులు, చేర్పులు చేసేందుకు బీసీసీఐ రూట్‌మ్యాప్ ఎంచుకుంది. రాను న్న ఇంగ్లండ్ పర్యటనతోపాటు జపాన్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ కోసం జట్లను ప్రకటించనుంది.
శనివారం సమావేశం కానున్న బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఐపీఎల్లో నిలకడగా రాణించిన శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా చేసే వీలుండగా, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఖాయామేననిపిస్తున్నది. హైదరాబాదీ తిలక్ వర్మను వైస్‌కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి.