Shreyas Iyer : భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) వన్డే పగ్గాలు అందుకున్నాడు. ఇండియా ‘ఏ’ జట్టు సారథిగా ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడిన అయ్యర్‌ను కెప్టెన్‌గా చేశారు సెలెక్టర్లు. ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌లో అయ్యర్ సారథిగా బరిలోకి దిగనున్నాడు. మామూలుగా అయితే రజత్ పాటిదార్ (Rajat Patidar) కెప్టెన్‌గా వ్యవహరించాల్సింది. కానీ, అయ్యర్ కోసం అతడు తన పదవిని త్యాగం చేశాడు. రెండు, మూడు మ్యాచ్‌లకు ఇండియా ఏ సారథిగా ఉండాల్సిన తిలక్ వర్మ సర్పంచ్ సాబ్‌కు డిప్యూటీగా కొనసాగుతాడు.
ఆసియా కప్ స్క్వాడ్‌లో అయ్యర్‌కు చోటు కల్పించని సెలెక్టర్లు.. అతడిని శాంతపరిచేందుకు ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌ను చేశారు. కానీ, అతడు మాత్రం ఆస్ట్రేలియా ఏ జట్టుతో ఒకే ఒక నాలుగు రోజుల మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ అనంతరం తాను ఫిట్‌గా లేనందున టెస్టుల నుంచి కొన్ని రోజులు విశ్రాంతి కావాలని బీసీసీఐ లేఖ రాశాడు. అతడి లేఖ అందిన వెంటే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టుల నుంచి బ్రేక్ ఇస్తూ వన్డే సిరీస్‌కు సారథిగా ఎంపిక చేసింది.
🚨 INDIA A UPDATE 🚨
The BCCI has announced the India A squad for the three One-Day matches against Australia A. 🇮🇳
Shreyas Iyer will lead the India A side. 🔥#Cricket #IndiA #Sportskeeda #ShreyasIyer pic.twitter.com/hQ5m1DFiYp
— Sportskeeda (@Sportskeeda) September 25, 2025
స్వదేశంలో సెప్టెంబర్ 30 నుంచి ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌లో ఇండియా ఏను అయ్యర్ నడిపించనున్నాడు. దాంతో, ఇదివరకే కెప్టెన్‌గా ప్రకటించిన పాటిదార్‌కు ఇరానీ కప్‌లో విదర్భ నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. భారత్ ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 30న కాన్పూర్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఇదే వేదికపై మిగతా రెండు వన్డేల్లో ఇరుజట్లు తలపడుతాయి.
ఇండియా ఏ స్క్వాడ్ (తొలి వన్డేకు) : శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదొని, సూర్యాన్ష్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, సిమర్జిత్ సింగ్.
ఇండియా ఏ స్క్వాడ్ (రెండు, మూడో వన్డేలకు) : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదొని, సూర్యాన్ష్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్.