Shreyas Iyer : భారత స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) వరల్డ్ కప్‌లో దుమ్మురేపుతున్నాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో తనదైన క్లాసిక్ షాట్లతో నెదర్లాండ్స్(Netherlands)పై శతకం బాదిన అయ్యర్.. మెగా టోర్నీలో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో నాటుకుపోతూ.. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చి అయ్యర్ కోహ్లీతో కలిసి ధాటిగా ఆడాడు. అనంతరం కేఎల్ రాహుల్(KL Rahul)తో 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి నాలుగో స్థానంలో తనకు పోటీయే లేదని మరోసారి నిరూపించుకున్నాడు. దాంతో, భారత మేనేజ్మెంట్తో పాటు అభిమానులు బేఫికర్‌గా ఉంటున్నారు.

నాలుగో స్థానంలో ఆడడం అయ్యర్‌కు కొత్తేమి కాదు. 2018లో 9 సార్లు నాలుగో డౌన్లో వచ్చిన అతడు 56.85 సగటుతో 398 పరుగులు బాదాడు. అయితే.. పునరాగమనం తర్వాత ఆసియా కప్(Asia Cup 2023)లో సెంచరీతో ఫామ్ చాటుకున్నాడు. కానీ, వరల్డ్ కప్ ఆరంభంలో తక్కువ స్కోర్‌కే వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో, హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) వస్తే అతడు ఇక బెంచ్ మీదే ఉండాల్సి వస్తుందని మాజీ క్రికెటర్లు.. అయ్యర్ బదులు సూర్యకుమార్ లేదా ఇషాన్ కిషన్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని చాలమంది వ్యాఖ్యానించారు.
కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్

రోజురోజుకు తనపై విమర్శలు ఎక్కవైతున్న నేపథ్యంలో అయ్యర్ జూలు విదిల్చాడు. కోల్‌కతాలో దక్షిణాఫ్రికాపై దంచి కొట్టిన అయ్యర్ సెంచరీకి 23 పరుగుల దూరంలో ఔటయ్యాడు. అయితే.. బెంగళూరలో సూపర్ సెంచరీతో విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాడు. ఒకదశలో కండరాలు పట్టేసినా లెక్కచేయకుండా రాహుల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 94 బంతుల్లో 128 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన అయ్యర్, రాహుల్‌తో కలిసి 208 పరుగులు జోడించాడు. ఇప్పటివరకూ 9 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో 421 రన్స్ కొట్టాడు.
Shreyas Iyer is the @aramco #POTM for a sensational batting display in Bengaluru 🎉#CWC23 | #INDvNED pic.twitter.com/fBkfPDtccM
— ICC Cricket World Cup (@cricketworldcup) November 12, 2023
న్యూజిలాండ్‌తో సెమీస్ పోరుకు ముందు సెంచరీతో కొండంత ఆత్మవిశ్వాసాన్ని పోగు చేసుకున్న అయ్యర్ నాలుగులో నేనున్నాంటూ కెప్టెన్, కోచ్‌కు భరోసానిచ్చాడు. నవంబర్ 15న ముంబైలోని వాంఖడేలో జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, కివీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.