Shreyas Iyer : భారత జట్టు స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) కెరీర్లో గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. పునరాగమనం తర్వాత ఆసియా కప్(Asia Cup 2023)లో అదరగొట్టిన అయ్యర్ టెస్టుల్లో మాత్రం అదే జోరు చూపలేకపోతున్నాడు. స్పిన్ స్పెషలిస్ట్‌గా ముద్రపడిన ఈ యంగ్‌స్టర్ వరుసగా నాలుగు టెస్టుల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. దాంతో, ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టుల్లో అతడిపై వేటు పడనుంది.
వన్డేల్లో దంచికొడుతున్న అయ్యర్.. టెస్టుల్లో మాత్రం తేలిపోతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన వైఫల్యాన్ని ఇంగ్లండ్ సిరీస్(England Series)లోనూ కొనసాగిస్తూ నిరాశపరుస్తున్నాడు. అయ్యర్ ఇప్పటివరకూ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో వరుసగా.. 31, 6, 0, 4 నాటౌట్, 35, 12, 27, 29 రన్స్ సాధించాడు. దాంతో, అతడిపై వేటు వేయాలనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులు ముగియడంతో.. మిగతా మూడు టెస్టులకు బీసీసీఐ స్క్వాడ్‌ను ప్రకటించనుంది. దాంతో, ఆ లిస్ట్‌లో అయ్యర్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడనే వార్తల నేపథ్యంలో రజత్ పాటిదార్‌కు మరొక మ్యాచ్ ఆడే చాన్స్ ఉంది. గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు ఫిట్నెస్ సాధిస్తే భారత్‌కు బ్యాటింగ్ కష్టాలు తప్పినట్టే. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్‌లు చెరొక మ్యాచ్ గెలిచాయి. కీలకమైన మూడో టెస్టు రాజ్‌కోట్‌లో ఫిబ్రవరి 15వ తేదీన జరుగనుంది.