ముంబై: శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) తన ఫీల్డింగ్ స్కిల్స్‌తో అందరికీ షాకిచ్చాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. బౌండరీ వద్ద గాలిలోకి ఎగురుతూ క్యాచ్ పట్టిన అతను.. ఆ తర్వాత బంతిని మైదానంలోకి విసిరేసి తన జిమ్నాస్టిక్ స్కిల్స్ ప్రదర్శించాడు. ఈ ఘటన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో జరిగింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా లాంగ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ ఆ బంతిని అందుకునేందుకు వచ్చాడు. అయితే దాదాపు బౌండరీ దాటి సిక్సర్ వెళ్తున్న ఆ బంతిని అయ్యర్ ఎగిరి అందుకున్నాడు. బ్యాలెన్స్ కోల్పోతున్న సమయంలో సమయస్పూర్తిని ప్రదర్శించాడు. బంతిని మైదానంలోకి విసిరేశాడు. అక్కడ ఉన్న ఫీల్డర్ బార్ట్లెట్ ఆ క్యాచ్‌ను పూర్తి చేశాడు. స్కోరు బోర్డు లెక్కల్లో ఈ క్యాచ్ బార్ట్లెట్ ఖాతాలోకి వెళ్లినా.. అయ్యర్ ఫీల్డింగ్ మాత్రం హైలెట్‌గా నిలుస్తుంది.
ఐపీఎల్ చరిత్రలోనే ఇదో అద్భుతమైన ఫీల్డింగ్ ఘట్టంగా పేర్కొంటున్నారు. అయితే ముంబై ప్లేయర్ల డగౌట్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. అయ్యర్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అక్కడ కూర్చుకున్న ముంబై బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ షాకయ్యారు. క్షణాల్లో జరిగి పోయిన ఆ క్యాచింగ్ స్టంట్‌ను చూసి సూర్యకుమార్ నోరువెళ్లబెట్టాడు. ఇక రోహిత్ కూడా ఏంటా క్యాచ్ రీతిలో సంకేతం ఇచ్చాడు.
SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯
🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥
Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL
— IndianPremierLeague (@IPL) April 16, 2026