Shreyas Iyer | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రాంచైజీ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. అయ్యర్ గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా కొనసాగాడు. అతని కెప్టెన్సీలో కేకేఆర్ టైటిల్‌ను గెలిచింది. జెడ్డా వేదికగా ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్‌ను పంజాబ్ రూ.26.75కోట్లు పోసి కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరుగనున్న ఐపీఎల్లో పంజాబ్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్నది.
పంజాబ్ కింగ్స్ 2008 నుంచి ఐపీఎల్లో కొనసాగుతున్నది. 2020 వరకు ఆ జట్టుకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పేరు ఉండేది. పంజాబ్ వరుసగా 17 సీజన్లలో పాల్గొనగా.. మొత్తం 16 మంది కెప్టెన్లుగా పని చేశారు. శ్రేయాస్ అయ్యర్ 17వ కెప్టెన్‌గా పనిచేయనున్నాడు. యువరాజ్ సింగ్ పంజాబ్ కింగ్స్‌కు తొలి కెప్టెన్. ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్ బెయిలీ అత్యధికంగా 35 మ్యాచుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. మహేల జయవర్ధనే, వీరేంద్ర సెహ్వాగ్, జితేష్ శర్మ కెప్టెన్లుగా పని చేశారు.