కాన్పూర్: అరంగేట్ర టెస్టులోనే శ్రేయస్ అయ్యర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండవ రోజు అయ్యర్ సెంచరీ పూర్తి చేశాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 16వ ఇండియన్ బ్యాటర్‌గా శ్రేయస్ రికార్డుల్లోకి ఎక్కాడు. చివరిసారి ఈ ఘనతను అందుకున్న బ్యాటర్ జాబితాలో పృథ్వీ షా ఉన్నాడు. 2018 అక్టోబర్‌లో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో పృధ్వీ షా తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేశాడు. తొలి టెస్టులోనే సెంచరీ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా లాల్ అమర్నాథ్ నిలిచాడు. 1933లో అతను ఈ రికార్డును నెలకొల్పాడు. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీలు చేసిన ఇండియన్ క్రికెటర్ల జాబితాలో ఆర్‌హెచ్ సోధన్, క్రిపాల్ సింగ్, అబ్బాస్ అలీ బెయిగ్, హనుమంత్ సింగ్, గుండప్ప విశ్వనాథ్, సురిందర్ అమర్నాథ్, మహమ్మద్ అజారుద్దీన్, ప్రవీణ్ ఆమ్రే, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఉన్నారు.
గురువారం తొలి టెస్టు ఆడుతున్న అయ్యర్‌కు.. లెజండరీ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్ట్ క్యాప్‌ను అందించారు. అయితే కాన్పూర్ వేదికపై అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రెండవ ప్లేయర్‌గా అయ్యర్ నిలిచాడు. గతంలో ఇదే పిచ్‌పై గుండప్ప విశ్వనాథ్ ఆ రికార్డును క్రియేట్ చేశాడు. 1969లో తొలి టెస్టు ఆడిన విశ్వనాథ్ మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టాడు. ఇక న్యూజిలాండ్‌పై అరంగేట్ర టెస్టులో సెంచరీ కొట్టిన మూడవ ఇండియన్‌గా అయ్యర్ నిలిచాడు. గతంలో క్రిపాల్ సింగ్, సురిందర్ అమర్నాథ్లు ఆ ఘనత సాధించారు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్ 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 105 రన్స్ చేసి ఔటయ్యాడు.
ICYMI – Dream Start: Shreyas Iyer's impressive century on debut.
— BCCI (@BCCI) November 26, 2021
WATCH 👉https://t.co/8vPIQUfgXJ #INDvNZ @Paytm @ShreyasIyer15 pic.twitter.com/OWpvh8FnbG