GGW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) హ్యాట్రిక్ కొట్టింది. ఉత్కంఠ పోరులో శ్రేయాంక పాటిల్(5-23) తిప్పేయగా గుజరాత్ జెయింట్స్‌పై భారీ విజయం సాధించింది. హిట్టర్లతో నిండిన గుజరాత్‌ను 150కే ఆలౌట్ చేసింది ఆర్సీబీ. రాధా యాదవ్(66), రీచా ఘోష్(44) మెరుపులకు శ్రేయాంక స్పిన్ మ్యాజిక్ తోడవ్వగా.. మూడో విక్టరీతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది ఆర్సీబీ. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో కంగుతిన్న గుజరాత్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో మాజీ ఛాంపియన్ ఆర్సీబీ జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి పోరులో ముంబై ఇండియన్స్‌కు.. ఆపై యూపీ వారియర్స్‌ను చిత్తు చేసిన బెంగళూరు మూడో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ మిడిలార్డర్ పట్టుదలతో కోలుకుని గుజరాత్‌కు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం శ్రేయాంక పాటిల్(5-23) విజృంభణతో ప్రత్యర్థిని 150కే ఆలౌట్ చేసి హ్యాట్రిక్ కొట్టింది. గుజరాత్ బ్యాటర్లలో భారతి ఫుల్మాలి 39 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
Clean Striking! 🚀
🎥 Bharti Fulmali walks back but not before treating the crowd to such terrific hits 💪
Updates ▶️ https://t.co/HHBOE0R6PH #TATAWPL | #KhelEmotionKa | #RCBvGG pic.twitter.com/aWNcs8XAY9
— Women’s Premier League (WPL) (@wplt20) January 16, 2026
డబ్ల్యూపీఎల్ 9వ మ్యాచులో ఆర్సీబీ మిడిలార్డర్ గొప్పగా ఆడింది. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు పడినా రాధా యాదవ్(66), రీచా ఘోష్(44)లు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా గొప్పగా ఆడారు. టాస్ ఓడిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. కష్వీ గౌతమ్ చెలరేగడంతో డేంజరస్ ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(17), దయలాన్ హేమలత(4) పెవిలియన్ చేరారు. కీలక ఇన్నింగ్స్ ఆడుదామనుకున్న కెప్టెన్ స్మృతి మంధాన(4) సైతం రేణుకా సింగ్ ఓవర్లో రాజేశ్వరికి క్యాచ్ ఇచ్చింది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే.. గౌతమి నాయక్(4)ను సోఫీ డెవినె పెవిలియన్ పంపింది. దాంతో.. 45 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి. ఇక ఆర్సీబీ స్వల్ప స్కోర్‌కే పరిమితమవ్వడం ఖాయమనుకున్నారంతా.
ప్రధాన బ్యాటర్లు విఫలైమనా జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్నారు రాధా యాదవ్(66), రీచా ఘోష్(44). వీరిద్దరూ ఏమాత్రం ఆత్మరక్షణ ధోరణితో ఆడకుండా గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా రాధ బ్యాట్ ఝులిపించి డబ్ల్యూపీఎల్‌లో తొలి అర్ధ శతకం బాదేసింది. రీచా జతగా 66 బంతుల్లోనే ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిందీ ఆల్‌రౌండర్. 105 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని జార్జియా వరేహం విడదీసింది. ఆ తర్వాత వచ్చిన నడినే డీక్లెర్క్(26) ఉన్నంత సేపు దంచేసింది. కష్వీ గౌతమ్ వేసిన 19వ ఓవర్లో రెచ్చిపోయిన డీక్లెర్క్ 6, 4, 4, 6 తో 22 రన్స్ రాబట్టింది. అయితే.. డివెన్(3-31) రెండు వికెట్లు తీసి 4 రన్స్ మాత్రమే ఇవ్వడంతో ఆర్సీబీ 182కే పరిమితమైంది.