Shoaib-Virat | భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గత కొద్దికాలంగా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లోనూ చెత్త ఫామ్‌తో విమర్శల పాలయ్యాడు. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతున్నది. టీమిండియా త్వరలోనే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనున్నది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు దుబాయికి వెళ్తుంది. వన్డే సిరీస్‌తో విరాట్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, కోహ్లీకి పాకిస్థాన్ మాజీ బౌలర్ అక్తర్ కీలక సూచనలు చేశాడు. మళ్లీ బ్యాట్ పరుగుల వరద ఎలా పారించగలడో చెప్పాడు.
చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్నది. భారత్, పాకిస్థాన్ గ్రూప్-ఏలో ఉన్నాయి. దుబాయి వేదికగా ఫిబ్రవరి 23న రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్నది. అక్తర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలనుకుంటే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉందని చెప్పాలని సూచించాడు. పాకిస్థాన్‌పై విరాట్ చెలరేగి ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు. మెల్బోర్న్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని.. మళ్లీ బ్యాట్‌తో రాణిస్తాడని షోయబ్ తెలిపాడు. పాకిస్థాన్‌పై వన్డేల్లో విరాట్‌కు మంచి రికార్డే ఉన్నది. 16 మ్యాచుల్లో మూడు సెంచరీలు చేసి.. 678 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్లో పాకిస్తాన్‌పై కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు. 70.28 సగటుతో 492 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్ట్‌లో మినహా మిగతా మ్యాచుల్లో రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అతను 190 పరుగులు మాత్రమే చేశాడు.
టీమిండియా, భారత్ పాకిస్థాన్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అక్తర్ పేర్కొన్నాడు. దుబాయిలో జరుగబోయే మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య మంచి పోటీ ఉంటుందని ఆశిస్తున్నానన్నాడు. భారత్ తరఫున విరాట్, పాక్ తరఫున బాబర్ ఆజామ్ పరుగులు.. జస్ప్రీత్ బుమ్రా, షహీన్, నసీమ్ బెస్ట్ బౌలింగ్‌ను ఊహించుకోవాలని సూచించాడు. సైమ్ అయూబ్, ఫఖార్ జమాన్ ఓపెనింగ్ చేస్తే ఇతర జట్లకు ప్రమాదకరమని పేర్కొన్నాడు. ఇద్దరు కలిసి ఆడడం చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. భారత్, పాక్ జట్టులో బెస్ట్ జట్టు ఏదో చెప్పాలని కోరగా.. రెండు ఇష్టమేనని చెప్పాడు.