బ్యాంకాక్ : ఆసియా అండర్-19 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్లు శివమ్, మౌసమ్ సుహాగ్ ముందంజ వేశారు. ఆదివారం జరిగిన పురుషుల 55కిలోల విభాగంలో శివమ్..బెజిర్గెన్ అన్నయెవ్(తుర్కమెనిస్థాన్)పై ఏకపక్ష విజయం సాధించాడు.
బౌట్లో ఆది నుంచే దూకుడు కనబరిచిన శివమ్ ప్రత్యర్థిపై పవర్ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. హుక్స్, జాబ్స్‌తో ముప్పెట దాడి చేస్తూ మూడు రౌండ్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మరోవైపు 65కిలోల కేటగిరీలో సుహాగ్ 3-2తో నూర్యాబైలులీ ముఖిత్(కజకిస్థాన్)ను చిత్తుగా ఓడించాడు. అయితే 60కిలోల విభాగంలో శుభమ్ 0-5తో టోర్టబెక్ అడిలెట్(కజికిస్థాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు.