Balayya – Karthi | నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇది బాలయ్య–బోయపాటి కాంబినేషన్లో నాలుగవ చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ ఆకాశాన్ని అంటుతున్నాయి. మేకర్స్ డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇంతటి హైప్ మధ్య బాలయ్యకి సోలో రిలీజ్ ఉంటుందన్న అభిమానులకు షాక్ ఇచ్చేలా మరో బిగ్ మూవీ అదే డేట్‌ను బుక్ చేసుకుంది. కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘వా వాతియార్’ కూడా అదే డిసెంబర్ 5న విడుదల కానుంది. మేకర్స్ ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉండటంతో ఈ చిత్రాన్ని తమిళంతో పాటు ఒకేసారి తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. దీంతో తెలుగు మరియు తమిళ భాషల్లో ‘అఖండ 2’కి గట్టి పోటీగా నిలవనుంది ‘వా వాతియార్’.ఈ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇందులో కార్తీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద్ రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా సంతోష్ నారాయణన్ పనిచేస్తుండగా, సినిమాటోగ్రఫీని జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్‌ను వెట్రే కృష్ణన్ హ్యాండిల్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ‘వా వాతియార్’ ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి స్పందన లభించింది. కార్తీ కెరీర్లో ఇది ఒక మైలురాయి చిత్రం అవుతుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. అదే సమయంలో ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ పోరులో బాలయ్య మాస్ రౌడిజం గెలుస్తుందా? లేక కార్తీ స్టైలిష్ పోలీస్ అవతారం విజయం సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.