సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు కమిన్స్, హెడ్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందట! అవును ఆసీస్‌ను వీడి తమ జట్టుకు ప్రాతినిధ్యంవహిస్తేఒక్కొక్కరికి రూ.58 కోట్ల చొప్పున ఇచ్చేందుకు సదరు ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రత్యేక కథనంలో పేర్కొంది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆఫర్‌ను కమిన్స్‌తో పాటు హెడ్ తిరస్కరించారట.
‘ఐపీఎల్లో పూర్తి స్థాయి జట్లను ఏర్పరుచుకునేందుకు గాను ఫ్రాంచైజీ కమిన్స్, హెడ్‌కు భారీ ఆఫర్ చేసింది. సీఏ నుంచి వార్షిక కాంట్రాక్టు కంటే ఎక్కువ ఇచ్చేందుకు మొగ్గుచూపింది. తాము జాతీయ జట్టుకే మొగ్గు చూపడంతో వారి ఆశలు నీరుగారాయి’ అని వార్తాసంస్థ రాసుకొచ్చింది.