చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ దుమ్మురేపుతున్నది. బుధవారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 46-29తో హర్యానా స్టీలర్స్‌ను చిత్తుగా ఓడించింది. తన వందవ పీకేఎల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ భరత్ హుడా ఏకంగా 20 పాయింట్లతో చెలరేగి జట్టుకు అద్బుత విజయాన్ని అందించాడు.
ప్రిక్వార్టర్స్‌కు తరుణ్ ; అన్మోల్ సంచలనం ఆర్కిటిక్ ఓపెన్
ఫిన్లాండ్: బీడబ్ల్యూఎఫ్ ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 ఈవెంట్లో హైదరాబాదీ యువ షట్లర్ తరుణ్ మన్నెపల్లి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. ఫిన్లాండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో తరుణ్.. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 11-21, 21-11, 22-20తో తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన ఏడోసీడ్, ప్రపంచ 14వ ర్యాంకర్ తొమ జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో యువ సంచలనం అన్బోల్ ఖర్బ్ సంచలన ప్రదర్శన చేసింది.