Shikhar Dhawan | టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ 37వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇతర ఆటగాళ్లతో కలిసి కేక్ కట్చేసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శిఖర్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా జట్టు నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆల్రౌండ్ వైఫల్యంతో పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. రోహిత్ (27), శ్రేయస్ (24) , సుందర్ (19) తలా కొన్ని పరుగులు చేశారు. శిఖర్ ధవన్ (7), కోహ్లీ (9) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 5, ఇబాదత్ 4 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో బంగ్లా 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది.