Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి సారథిగా వ్యవహరించనున్న హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌కు సంబంధించి మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. వన్డే ప్రపంచకప్‌లో గాయపడి ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో వైద్యుల సమక్షంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న పాండ్యా.. మార్చి నుంచి మొదలుకాబోయే ఐపీఎల్ – 17 వరకూ ఫిట్ అయ్యేది అనుమానమే అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ ఫ్యాన్స్.. ‘శర్మ’తో పెట్టుకుంటే ‘కర్మ’ తప్పదని సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మను తప్పించి హార్ధిక్ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే.
చీలమండ గాయంతో వన్డే ప్రపంచకప్‌తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికా టూర్ మిస్ అయిన హార్ధిక్.. జనవరిలో అఫ్గానిస్తాన్ సిరీస్ వరకూ ఫిట్ అయ్యేది అనుమానమేనని బీసీసీఐ వర్గాలు గతంలోనే తెలిపాయి. తాజాగా బీసీసీఐ ప్రతినిధి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికైతే హార్ధిక్ ఫిట్నెస్ స్టేటస్ పై ఎటువంటి అప్డేట్ కూడా లేదు. కనీసం ఐపీఎల్ ముగిసేవరకైనా అతడు అందుబాటులో ఉండటం కూడా ప్రశ్నార్థకంగా ఉంది..’ అని తెలిపాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Dear Hardik Pandya,
Messing with Rohit Sharma is like meeting your Karma pic.twitter.com/gb18iHwy3a— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) December 23, 2023
Hardik pandya is almost Ruled out of IPL 2024 !!
I repeat Never ever Mess with Rohit Sharma.🔥
Sharma & Karma always strikes! pic.twitter.com/DWnJNT1SBe
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) December 23, 2023
హార్ధిక్ ఫిట్‌నెస్‌పై వచ్చిన న్యూస్‌తో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ‘డీయర్ హార్ధిక్ పాండ్యా.. రోహిత్ శర్మతో పెట్టుకోవడమంటే నువ్వు నీ కర్మతో షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే…’ అని ఓ అభిమాని రాసుకురాగా మరో అభిమాని.. ‘హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ 2024 నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే.. నేను మళ్లీ చెబుతున్నా, రోహిత్ జోలికి రావొద్దు. శర్మతో పెట్టుకుంటే కర్మ అనుభవించాల్సిందే..’ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక పలువురు అభిమానులు ఫన్నీ మీమ్స్, ట్రోల్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
OFFICIAL 🚨 : Hardik Pandya is officially ruled out of T20WC, Afganistan series and IPL. Captain Rohit Sharma is all set to lead the Indian team without any noise.
Never mess with Karma & Rohit Sharma. pic.twitter.com/1xreZcQmiW
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) December 23, 2023
Rohit Sharma and SKY with Cameraman bumrah pic.twitter.com/bLn6VfN56A
— Anoop 🇮🇳 (@ianooop) December 23, 2023