ముంబై: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (119 బంతుల్లో 113 నాటౌట్, 17 ఫోర్లు) వీరోచిత శతకంతో జమ్ము కశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. శార్దూల్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్ (58 నాటౌట్, 6 ఫోర్లు) ఆదుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో ముంబై రెండో రోజు ఆట ముగిసే సమయానికి 274/7 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ రాణించడంతో ముంబైకి 188 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 174/7తో రెండో రోజు ఆరంభించిన జమ్ము కశ్మీర్.. 206 పరుగులకు ఆలౌట్ అవడంతో ఆ జట్టు 86 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ముంబైకి ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (26), రోహిత్ శర్మ (28) మొదటి వికెట్‌కు 54 పరుగులు జోడించి మెరుగైన ఆరంభమే అందించారు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించినా ఈ ఇద్దరూ.. యుధ్వీర్ సింగ్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేయడంతో ముంబై ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలిపోయింది. రహానే (16), శ్రేయస్ (17) విఫలమవగా దూబె మళ్లీ డకౌట్ అయ్యాడు. 101 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ముంబైని.. శార్దూల్, తనుష్ ఆదుకుని అజేయమైన 8వ వికెట్‌కు 173 పరుగులు జోడించారు.
ఢిల్లీతో వడోదరాలో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (7/38, తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) మాయ చేయడంతో సౌరాష్ట్ర ఘన విజయం సాధించింది. పంత్ (17) మళ్లీ విఫలమయ్యాడు.