శార్దుల్ ఠాకూర్ హాఫ్ సెంచరీ.. ముంబై 224 ఆలౌట్
ముంబై, విదర్భ రంజీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మొదలైన ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రహానే(7), శ్రేయాస్ అయ్యర్(7) విఫలమైన చోట ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్(75) మరోమారు తన విలువ చాటుకున్నాడు.
- విదర్భతో రంజీ ఫైనల్
ముంబై: ముంబై, విదర్భ రంజీ టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం మొదలైన ఫైనల్లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రహానే(7), శ్రేయాస్ అయ్యర్(7) విఫలమైన చోట ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్(75) మరోమారు తన విలువ చాటుకున్నాడు. 81-1 స్కోరుతో మెరుగైన స్థితిలో కనిపించిన ముంబై 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో శార్దుల్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గాడిలో పడేశాడు.
ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న శార్దుల్ సాధికారిక ఇన్నింగ్స్‌తో ముంబై తేరుకుంది. వన్డే తరహాలో ఆడిన శార్దుల్ 69 బంతుల్లో 75 పరుగులు చేశాడు. హర్ష్ దూబే, యశ్ ఠాకూర్ మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన విదర్భ 3 వికెట్లకు 31 పరుగులు చేసింది. అథర్వ (21), ఆదిత్య (0) క్రీజులో ఉన్నారు. ధవల్కులకర్ణి రెండు వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

