జైపూర్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కుటుంబానికి జాక్‌పాట్ తగిలింది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చేతులు మారనున్న వేళ.. ఈ స్పిన్ మాంత్రికుడి కుటుంబానికి సుమారు రూ. 450 కోట్లు దక్కే అవకాశముంది. ఈ లీగ్ తొలి సీజన్లో ఆ జట్టుకు సారథిగా వ్యవహరించి రాయల్స్‌కు టైటిల్ అందించిన వార్న్‌కు తన కాంట్రాక్టు సందర్భంగా ఫ్రాంచైజీతో ఒక ఒప్పందం కుదిరింది.
దీని ప్రకారం వార్న్‌కు కెప్టెన్సీ బాధ్యతలే కాకుండా జట్టుకు ఆడినన్ని రోజులు అతడికి ప్రతియేటా 0.75 శాతం యాజమాన్య వాటాను కేటాయించారు. ఈ లెక్కన రాయల్స్‌కు 4 సీజన్ల పాటు ఆడిన వార్న్.. 3 శాతం వాటా కల్గిఉన్నాడు. ఇప్పుడు రాయల్స్ జట్టు రూ. 15,300 కోట్లకు అమ్ముడైన నేపథ్యంలో వార్న్ కుటుంబం గనుక ఆ వాటాలను అమ్మేస్తే వారికి సుమారు రూ. 450 కోట్లు దక్కుతుంది.