Mohammad Shami : వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టుకు దూరమైన భారత స్పీడ్‌స్టర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) త్వరలోనే పునరాగమనం చేయనున్నాడు. సర్జరీ నుంచి కోలుకున్న షమీ బెంగళూరులో నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దేశవాళీలో ఆడనున్న షమీ.. తనకు నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని, ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపాడు. అతడు నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నా మోకాలి నొప్పి వంద శాతం తగ్గిపోయింది. ముందుగా ఫిట్నెస్ మీదనే నా గురి. ఇప్పుడు 100 శాతం చక్కగా బౌలింగ్ చేయగలుగుతున్నా. ఇప్పుడు నా దృష్టంతా ఫిట్నెస్ సాధించడం, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఆడడం మీదనే ఉంది. అయితే.. అంతకంటే ముందు ఒకటి రెండు రంజీ మ్యాచ్‌లు ఆడుతా అని షమీ వెల్లడించాడు. నవంబర్‌లో ఆసీస్ పర్యటన గురించి ఇదివరకూ స్పందించిన షమీ.. ఈసారి కూడా తామే ఫేవరెట్లమని చెప్పాడు. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ కొడుతామని షమీ కంగారూ జట్టును హెచ్చరించాడు.
SHAMI AT CHINNASWAMY STADIUM…!!! 🔥
– Shami bowling to the Indian Assistant Coach in nets. [CricSubhayan] pic.twitter.com/WxRm5XohSd
— Johns. (@CricCrazyJohns) October 20, 2024
ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయాలతో చరిత్ర సృష్టించిన భారత జట్టు నవంబర్‌లో మళ్లీ అక్కడికి వెళ్లనుంది. ఇప్పటికే 2018-19, 2020-21లో విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి కూడా విజయంపై ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో షమీ భారత్‌దే ట్రోఫీ అని చెప్పేశాడు. ‘భారత జట్టే ఫేవరట్ అని నేను గట్టిగా నమ్ముతున్నా. గత ఆసీస్ పర్యటనలో సీనియర్లు లేరు. యువకులతో కూడిన జట్టుతోనే ఆడాం. ఇప్పటికీ మాదే గొప్ప అని నిరూపించుకుంటాం’ అని షమీ అన్నాడు.
Mohammad Shami said, “I am pain free now. I want to make sure I bowl enough before going to Australia. And for that I’m targeting 1-2 Ranji games”. (Revsportz). pic.twitter.com/rDBZU39Z5l
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 21, 2024
ఈ ఏడాది నవంబర్‌లో భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. 22వ తేదీన ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. 1992 తర్వాత తొలిసారి ఈ సిరీస్‌ను ఐదుమ్యాచ్లుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని మేటి జట్లు అయిన భారత్, ఆస్ట్రేలియాలు మైదానంలోకి దిగితే హోరాహోరీ తప్పదు. అది కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అయితే ఇరుజట్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్ కవ్వింపులతో ఆటను మరింత రక్తి కట్టిస్తారు.
Laut aao Shami bhai majak nahi raha ab pic.twitter.com/I3LfM9iqFe
— B. (@Duk3Nukem_) October 20, 2024
అంతేకాదండోయ్.. పోటాపోటీగా శతకాలతో.. వికెట్ల వేటతో చెలరేగిపోతారు కూడా. అయితే.. గత రెండు పర్యాయాలు టీమిండియా దెబ్బకు కంగారు జట్టు తోకముడిచింది. దాంతో, ఈసారి సొంతగడ్డపై ఎలాగైనా సరే ట్రోఫీ సాధించి పరువు కాపాడుకోవాలని ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ భావిస్తోంది. మరోవైపు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ రేసులో ముందున్న భారత్ కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇంకేముంది.. రెండు సమఉజ్జీల మధ్య టెస్టు సమరం భలే రంజుగా సాగడం పక్కా.