కైరో (ఈజిప్టు): ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో భారత యువ షూటర్ల స్వర్ణ పతక ప్రదర్శన కొనసాగుతున్నది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో శాంభవి క్షీర్సాగర్, దివ్యాన్షు దేవాంగన్ జోడీ పసిడికి గురిపెట్టింది.
ఫైనల్లో భారత ద్వయం.. 499.9 పాయింట్ల ప్రపంచ రికార్డు స్కోరుతో ఈ టోర్నీలో దేశానికి నాలుగో స్వర్ణాన్ని అందజేసింది. చైనీస్ తైఫీ (498.3), ఫ్రాన్స్ (434) వరుసగా రజతం, కాంస్యం నెగ్గాయి. శాంభవి, దివ్యాన్షు పతకంతో కలిపి ఈ టోర్నీలో భారత్ ఇప్పటిదాకా 12 పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన కొనసాగుతున్నది.