Champions One Day Cup : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam), పేసర్ షాహీన్ ఆఫ్రిది(Shaheen Afridi)ల కెప్టెన్సీ వివాదం అందరికీ తెలిసిందే. నిరుడు వన్డే వరల్డ్ కప్ తర్వాత బాబర్‌ను తప్పించి ఆఫ్రిదిని పొట్టి ఫార్మాట్‌కు సారథిని చేయడం.. మళ్లీ వరల్డ్ కప్ సమయానికి బాబర్‌కు పగ్గాలు అప్పగించడం పాక్ క్రికెట్లో పెద్ద దుమారమే రేపింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సఖ్యత లేదనేది వాస్తవం. తాజాగా స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ వన్డే కప్(Champions One Day Cup)లో ఇద్దరూ ప్రత్యర్థులుగా ఎదురుపడ్డారు. ఈ సందర్బంగా సెంచరీ మిస్ చేసుకున్న బాబర్ డగౌట్‌కు వెళ్తుంటే ఆఫ్రిది సంబురాలు చేసుకున్నాడు.
చాంపియన్స్ వన్డే కప్‌లో మహమ్మద్ హ్యారిస్ సారథ్యంలోని స్టాలన్స్, షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని లయన్స్ జట్లు తలపడ్డాయి. బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌లో విఫలమైన బాబర్(76) ఈసారి దంచి కొట్టాడు. తయ్యబ్ తాహిర్(74)తో కలిసి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ధశతకం తర్వాత జోరు పెంచి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న బాబర్‌ను లయన్స్ కెప్టెన్ షాహీన్ ఆఫ్రిది బోల్తా కొట్టించాడు.
.@iShaheenAfridi gets the prized wicket of @babarazam258 🦅 #DiscoveringChampions #AlliedBankStallionsvNurpurLions pic.twitter.com/goDNi2MhQs
— Bahria Town Champions Cup (@championscuppcb) September 13, 2024
షాహీన్ ఆఫ్రిది, బాబర్ ఆజాం
35వ ఓవర్లో ఊరించే బంతితో బాబర్ వికెట్ సాధించాడు. అంతే సంబురాల్లో మునిగిపోయాడు. నిరాశగా బాబర్ పెలిలియన్ వైపు వెళ్తుంటే ఈ స్పీడ్‌స్టర్ తన స్టయిల్లో రెండు చేతులు పైకెత్తి సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్లైన్లో తెగ తిరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 336 పరుగులు కొట్టిన స్టాలన్స్ అనంతరం లయన్స్‌ను 203కే కట్టడి చేసింది. దాంతో, 133 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.