Para Athlete Navdeep Singh : పారాలింపిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నవ్‌దీప్ సింగ్(Navdeep Singh) దేశానికి 29వ పతకం అందించాడు. ఫైనల్లో జావెలిన్‌ను విసిరిన అనంతరం అతడి సెలబ్రేషన్ వీడియో ఓ రేంజ్లో వైరల్ అయిందనుకో. పారిస్ నుంచి స్వదేశం వచ్చిన నవ్‌దీప్ ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)ని కలిశాడు. అనంతరం ఈ జావెలిన్ త్రోయర్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయాడు. ఈ సందర్భంగా ఈ పారా అథ్లెట్ తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో చెప్పేశాడు.
ఇంటర్వ్యూలో శుభంకర మిశ్రా ‘మీ ఫేవరెట్ భారత క్రికెటర్ ఎవరు? మహేంద్ర సింగ్ ధోనీనా?.. విరాట్ కోహ్లీనా?’ అని ప్రశ్నించాడు. అందుకు నవ్‌దీప్ ఊహించని సమాధనంతో అతడికి షాకిచ్చాడు. ‘నా ఫేవరెట్ భారత క్రికెటర్ ధోనీ, కోహ్లీలు కాదు. ప్రస్తుతం టీమిండియా సారథగా ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma). అతడు చాలా అద్భుతంగా ఆడుతాడు.
Shubhankar Mishra : Ms Dhoni or Virat Kohli ?
Gold medalist Navdeep Singh : Rohit Sharma 🛐
Look at the smile on the face of @shubhankrmishra bhaiyya 🥰✨
— ` (@shiv0037) September 13, 2024
పైగా వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టాడు. ఆ ఇన్నింగ్స్‌ను వర్ణించేందుకు మాటలు చాలవు. అప్పటి నుంచి నేను రోహిత్‌కు అభిమాని అయిపోయా. అవును.. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడే. కానీ, రోహిత్ నా ఫేవరెట్ క్రికెటర్’ అని నవ్‌దీప్ తెలిపాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఈమధ్యే టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
పారిస్ ఆతిథ్యమిచ్చిన పారాలింపిక్స్‌లో నవ్‌దీప్ స్వర్ణంతో గర్జించాడు. జావెలిన్ త్రో ఎఫ్41 ఫైనల్లో అతడు ఈటెను 47.32 మీటర్ల దూరం విసిరాడు. ఒకే త్రోతో అటు పసిడి పతకాన్ని పట్టేయడమే కాకుండా చైనా అథ్లెట్ పేరిట ఉన్న రికార్డును నవ్‌దీప్ బద్ధలు కొట్టాడు. తద్వారా పారా విశ్వ క్రీడల్లో వరుసగా రెండో పతకం తన ఖాతాలో వేసుకున్నాడు.