Maruthi Nagar Subramanyam | టాలీవుడ్ సినీ దిగ్గజం రావు గోపాలరావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు రావు రమేశ్. అయితే ఆయన హీరోగా వచ్చిన తాజా చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం (Maruthi Nagar Subramanyam). ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ఈ చిత్రం సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇంద్రజ హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సుబ్రమణ్యం (రావు రమేశ్) ఓ నిరుద్యోగి.. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తప్ప జాబ్ చేయనంటూ పంతం పట్టుకుని కుర్చుంటాడు. అయితే చివరికి తాను అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం రాగా.. అది కాస్తా కోర్టు కేసులో ఇరుక్కుంటుంది. దీంతో తన భార్య కళారాణి (ఇంద్రజ) సంపాదనపైనే ఆధారపడి బ్రతుకుతుంటాడు. సుబ్రమణ్యం కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) పెద్దవాడు అయిన కూడా జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తుఉంటాడు. అయితే సుబ్రమణ్యం కొడుకు అర్జున్ కాంచన అనే అమ్మాయితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. సుబ్రమణ్యంకి చెప్పి తన పెళ్లి ఎలా అయిన చేయమంటాడు. అయితే అర్జున్ కోసం కాంచన ఇంటికి వెళ్లిన సుబ్రమణ్యంకి అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైంది. సుబ్రమణ్యంకు సడన్గా రూ.10 లక్షలు ఎందుకు పడ్డాయి. సుబ్రమణ్యంకి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా.. అర్జున్, కాంచన ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
We got the laughter therapy you need!
The biggest family entertainer of the year#MaruthiNagarSubramanyam premieres on Aha on the 20th!@lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/JZWAfCeklh— ahavideoin (@ahavideoIN) September 13, 2024