న్యూఢిల్లీ: యువ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ తొలిసారి భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గురువారం నుంచి ప్రారంభం కానున్న జింబాబ్వే పర్యటనకు షాబాజ్.. టీమ్ఇండియాకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరమవడంతో.. అతడి స్థానంలో సెలెక్టర్లు షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేశారు. ‘కౌంటీ క్రికెట్లో గాయపడ్డ వాషింగ్టన్ స్థానంలో భారత సీనియర్ సెలక్షన్ కమిటీ జింబాబ్వే పర్యటనకు షాబాజ్‌ను ఎంపిక చేసింది’ అని మంగళవారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 27 ఏండ్ల షాబాజ్ అహ్మద్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆకట్టుకున్న విషయం తెలిసిందే.