INDW vs SLW : నామమాత్రమైన మ్యాచ్‌లోనూ భారత ఓపెనర్లు దంచేస్తున్నారు. త్రివేండ్రంలో జరుగుతున్న నాలుగో 20లో షపాలీ వర్మ(35 నాటౌట్), స్మృతి మంధాన(26 నాటౌట్)లు పోటీపడి బౌండరీలు బాదుతున్నారు. చమరి ఆటపట్టు వేసిన ఆరో ఓవర్లో షఫాలీ రెండు ఫోర్లు బాదగా స్కోర్ 60 దాటింది. వీరిద్ధరి మెరుపులతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ పడకుండా 61 పరుగులు చేసింది.
పొట్టి సిరీస్‌లో శ్రీలంకు దడ పుట్టిస్తున్న భారత్ నాలుగో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు షపాలీ వర్మ(35 నాటౌట్), స్మృతి మంధాన(26 నాటౌట్)లు దూకుడే మంత్రగా చెలరేగుతున్నారు. షెహానీ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదిన మంధాన.. ఆ తర్వాత కావ్య బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు రాబట్టింది. వరుసగా రెండు అర్ద శతకాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న షఫాలీ సైతం ఫోర్లతో విరుచుకుపడింది. లంక కెప్టెన్ వేసిన ఆరో ఓవర్లో షషాలీ రెండు ఫోర్లు సంధించింది. దాంతో.. పవర్ ప్లేలో టీమిండియా 61 రన్స్ చేసింది.
5⃣0⃣ partnership 🆙
Smriti Mandhana 🤝 Shafali Verma #TeamIndia 61/0 after 6 overs.
Updates ▶️ https://t.co/9lrjb3dMqU #INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/4yCnpl3XdJ
— BCCI Women (@BCCIWomen) December 28, 2025