బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ గడ్డపై చారిత్రక టీ20 సిరీస్ గెలిచిన భారత్ తమ ఆఖరి పోరులో ఆకట్టుకోలేకపోయింది. శనివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఐదో టీ20 పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాదీ స్పీడ్‌స్టర్ అరుంధతిరెడ్డి వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి 6 పరుగులు అవసరం కాగా, బ్యూమాంట్(30), అమీ జోన్స్(10) వికెట్లు కోల్పోయినా ఇంగ్లండ్ విజయం వైపు నిలిచింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డానీ వ్యాట్(56), సోఫీ డంక్లె(46) రాణించారు.
అరుంధతిరెడ్డి, దీప్తిశర్మ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు ఓపెనర్ షెఫాలీవర్మ(41 బంతుల్లో 75, 13ఫోర్లు, సిక్స్) ధనాధన్ అర్ధసెంచరీతో టీమ్ఇండియా 20 ఓవర్లలో 167/7 స్కోరు చేసింది. మందన(8)తో పాటు రోడ్రిగ్స్(1), కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(15), హర్లిన్ డియోల్(4), దీప్తిశర్మ(7) స్వల్ప స్కోర్ల వెనుదిరిగారు. చార్లీ డీన్(3/23) మూడు వికెట్లతో రాణించింది. 10 వికెట్లు తీసిన తెలుగు స్పిన్నర్ శ్రీచరణికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.